Nov 8, 2022, 12:11 PM IST
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి కొందరు తాగుబోతులు వీరంగం సృష్టించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో భర్త్ డే పార్టీ చేసుకున్న యువకులు మద్యంమత్తులో రచ్చచేసారు. నడిరోడ్డుపై గుంపుగా తిరుగుతూ గట్టిగా అరుస్తూ హంగామా చేయడమే కాదు వాహనదారులను ఆపి దురుసుగా ప్రవర్తించారు. ఓ కారును అడ్డుకుని అందులోని వ్యక్తిపై దాడికి యత్నించింది ఈ తాగుబోతు యువకుల గ్యాంగ్. వీరి వీరంగంలో సత్తెనపల్లి వాసులు అర్ధరాత్రి అసౌకర్యానికి గురయ్యారు.