సచివాలయ మహిళా ఉద్యోగిణిపై దౌర్జన్యం... టిడిపి కార్పోరేటర్ అరెస్ట్

Jun 24, 2021, 9:12 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సచివాలయ ఉద్యోగులపై టీడీపీ కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగాడు. వ్యాక్సినేషన్ చేపడుతున్న 38వ డివిజన్ సచివాలయ సిబ్బందితో స్థానిక టీడీపీ కార్పొరేటర్ అన్నం ఆనంద్ గొడవకు దిగాడు. తమ వారికి వ్యాక్సిన్ వేయాలంటూ కార్పొరేటర్ పట్టుబట్టగా అందుకు సచివాలయ సిబ్బంది అంగీకరించలేదు. ఇదికాస్తా ఉద్యోగులు, కార్పొరేటర్ మధ్య వివాదానికి దారితీసింది. ప్రస్తుతం సెకండ్ డోస్ మాత్రమే వేస్తున్నామని...