Jan 14, 2022, 9:47 AM IST
గుంటూరు: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్యకు సిద్దపడింది. సెల్పీ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టిన యువతి ప్రియుడితో తప్ప వేరెవరతోనూ జీవితాన్ని పంచుకోలేనని... అతడితో పెళ్లి జరక్కపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కొత్తపేటకు చెందిన వైష్ణవి అనే యువతి సాయి శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట పెళ్లి దగ్గరకు వచ్చేసరికి దూరమయ్యారు. పెళ్ళి చేసుకోవాలని అడిగినప్పటి నుండి శ్రీనివాస్ ముఖం చాటేసాడని... అతడి తల్లిదండ్రులు తనపై దాడి చేశారని వైష్ణవి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే న్యాయం చేయాలని స్థానిక పోలీసులనే కాదు జిల్లా ఎస్సీని కూడా కలిసినట్లు... శ్రీనివాస్ తో పెళ్లి జరక్కుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. యువతి సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది