video: పవన్ కల్యాణ్ స్టేజీకి పోలీసుల ఆటంకం

Nov 3, 2019, 10:49 AM IST

విశాఖలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక కొరతకు నిరసనగా జనసేన ఆదివారం విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 

శనివారం సాయంత్రం జనసేన కార్యకర్తలు వేదికను నిర్మించడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. కార్యక్రమానికి ముందుగా అన్ని అనుమతులను తీసుకున్న కూడా స్టేజి వేయవద్దని పోలీసులు అడ్డుకోవడాన్ని జనసేన కార్యకర్తలు నిరసించారు తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు.