Apr 9, 2020, 4:43 PM IST
తిరుపతిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతున్న శ్రీకాళహస్తి కి చెందిన ఓ వ్యక్తిని తిరుపతి రుయా వైద్యులు డిశ్చార్జి చేశారు. లండన్ నుండి వచ్చిన ఇతనికి మార్చి 25న కరోనా పాజిటివ్ రావడంతో తిరుపతి రుయాలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. 14 రోజుల తర్వాత రెండుసార్లు కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతన్నిి గృహనిర్బంధానికి తరలించారు.