రోడ్డు మీద కనిపిస్తే.. అంతే సంగతులు.. పట్టుకుపోయి క్వారంటైన్ లో పడేస్తారు..

Apr 29, 2020, 2:34 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో లాక్ డౌన్ సమయంలో మాట వినకుండా రోడ్లపైకి వచ్చే వారిని అంబులెన్స్ లో ఎక్కించి క్వారంటైన్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఉదయం 6 నుండి 9 వరకే ప్రజలు బయటకు రావాలని ఆ తరువాత రోడ్డుమీద విచ్చలవిడిగా తిరిగే వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపిస్తామని జరుగుతుందని నందిగామ పోలీస్ అధికారులు అంటున్నారు.నందిగామ మెయిన్ రోడ్ లో గాంధీ సెంటర్ రైతు బజార్ కొన్ని ఏరియాల్లో విచ్చలవిడిగా రోడ్డు మీదకు వచ్చే వారిని సీఐ కనకరాజు క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. 188సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పలు వాహనాలు సీజ్ చేశామని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు.