కర్నూల్ లో చంద్రబాబుకు నిరసన సెగ ... కాన్వాయ్ ను అడ్డుకున్న ఆందోళనకారులు

Nov 17, 2022, 10:55 AM IST


కర్నూల్ : టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కర్నూల్ జిల్లాలో నిరసన సెగ తాకింది. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చంద్రబాబు కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలోనే
వైసిపి ప్రభుత్వ మూడురాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూల్ కు న్యాయరాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును తమ ప్రాతంలో పర్యటించడానికి వీళ్లేదంటూ పత్తికొండవాసులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు కాన్వాయ్ పత్తికొండకు రాగానే రాయలసీమ ద్రోహి గో బ్యాక్... అంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించి అడ్డుకునే ప్రయత్నం చేసారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను రోడ్డుపైనుండి పక్కకుజరిపి చంద్రబాబు కాన్వాయ్ ముందుకు పోనిచ్చారు.