కాకినాడలో హైడ్రామా... కెఎ పాల్ కాన్వాయ్ కార్లు నిర్భంధం

Jul 28, 2022, 3:08 PM IST

కాకినాడ : ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ కు కాకినాడ జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింంది. ఓ కార్యక్రమంలో భాగంగా కాకినాడకు విచ్చేసిన పాల్ ను రత్నకుమార్ అనే వ్యక్తి నిర్భంధించాడు. కెఎ పాల్ కాన్వాయ్ లోని రెండు కార్లను రత్న కుమార్ వర్గీయులు సీబీఎన్‌సీ కాంపౌండ్ లో నిర్భంధించారు. తనకు పాల్ పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని... అడిగితే ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరిస్తున్నాడని రత్నకుమార్ పేర్కొన్నాడు. అందువల్లే ఇలా కార్లను తన కాంపౌండ్ లోకి తీసుకువచ్చి దాచినట్లు రత్నకుమార్ పేర్కొన్నారు. అయితే తనకు అసలు రత్నకుమార్ ఎవరో తెలియదని కెఎ పాల్ పేర్కొన్నాడు. తననుగానీ, తన కార్లను గానీ ఎవరూ నిర్బంధించలేదని... కాకినాడలో కార్యక్రమాలన్ని చక్కగా ముగించుకుని తిరిగి వెళుతున్నానని పాల్ మీడియాకు తెలిపారు.