Apr 8, 2020, 2:28 PM IST
కృష్ణాజిల్లా, తిరువూరులోని ఆంధ్రా తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు తనిఖీ చేశారు. తిరువూరు పట్టణానికి చెందిన యూటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ 200 పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే లారీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు భోజన ప్యాకెట్ల పంపిణీ చేశారు. దీంతోపాటు పోలీస్ సిబ్బందికి గ్లౌజ్ లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.