Aug 16, 2022, 10:55 AM IST
విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవం రోజు పిల్లాపాపలతో సరదాగా సినిమాకు వెళ్లిన విజయవాడ వాసులకు నిరాశ ఎదురయ్యింది. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ క్యాపిటల్ సినిమాస్ లో కార్తికేయ2 సినిమా చూసేందుకు సోమవారం రాత్రి ప్రేక్షకులు వెళ్లారు. అయితే స్క్రీన్ 2 లో సాంకేతిక సమస్య తలెత్తడంతో షోను క్యాన్సిల్ చేసారు. అయితే అందరికీ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయగా ఆన్ లైన్ లో టికేట్ తీసుకున్నవారికి మాత్రం డబ్బులు తిరిగివ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు మాల్ కు చేరుకుని ప్రేక్షకులను సముదాయించి అక్కడినుండి పంపించారు.