వలస కూలీలని అడ్డుకున్న కంచరపాలెం పోలీసులు

Apr 15, 2020, 6:05 PM IST

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 మంది వలస కూలీలను కంచరపాలెం పోలీసు ల అడ్డుకున్నారని వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి జి.స్వరూపరాణి తెలిపారు. లాక్ డౌన్ పొడిగించడంతో గాజువాక ఆటో నగర్ అన్సారీ ఫ్యాబ్రికేషన్ సంస్థకు చెందిన జార్ఖండ్ వలస కూలీలు 22మంది బుదవారం ఉదయం కాలినడకన జార్ఖండ్ కు వెల్తున్నారని, వీరిని ని ఐటిఐ కూడలి జాతీయ రహదారి ప్రభుత్వ పాలిటెక్నీక్ వద్ద గమనించి అడ్డుకుని వెనక్కి పంపామని తెలిపారు.