లం..కొడకా, ముం.. కొడకా అంటూ... సొంత పార్టీ ఎమ్మెల్యేను అమ్మనాబూతులు తిట్టిన వైసిపి నాయకురాలు

Apr 4, 2022, 3:33 PM IST

 
కైకలూరు: కృష్ణా జిల్లా వైసిపిలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. కైకలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కు అసమ్మతి సెగ తగిలింది. కైకలూరు ఎమ్మెల్యే తీరునచ్చక విబేధించిన సొంత పార్టీ నాయకులే వ్యతిరేకవర్గంగా ఏర్పడ్డారు. ఈ నాయకులంతా మహిళా నేత భవాని ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకురాలు భవాని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లం... కొడకా, ముం.. కొడకా అంటూ ఎమ్మెల్యేను అమ్మనాబూతులు తిడుతూ ఏం పీక్కుంటావో పీక్కో అంటూ మహిళా నాయకురాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.