Aug 7, 2020, 3:02 PM IST
విజయవాడలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. రేపటినుండి విధులు బహిష్కరించబోతున్నట్టు తెలిపారు. 400 మంది జూడాలు కోవిద్ సెంటర్లో పనిచేస్తున్నారన్నారు. వారికి సరైన వసతులు లేవని, భీమా సౌకర్యం కల్పించి, ప్రేత్యేక పిపిఈ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ జూడాలకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకపోతే రేపటినుండి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.