Mar 17, 2022, 10:33 PM IST
తాడిపత్రి: రంగుల పండగ హోలీ సంబరాలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అంబరాన్నంటాయి. స్వయంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కార్పోరేటర్లు, టిడిపి నాయకులు, అనుచరులు, స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఇలా రంగుల్లో మునిగితేలిని మున్సిపల్ ఛైర్మన్ ఎవరో గుర్తుపట్టలేనట్లు మారిపోయారు.