Aug 14, 2023, 5:25 PM IST
విజయవాడ : మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టని రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నారంటూ జనసేన నాయకుడు పోతిన మహేష్ సెటైర్లు విసిరారు. ఆగస్ట్ 9న వెల్లంపల్లి పుట్టినరోజు అయితే ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వేడుకలు జరుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. వెల్లంపల్లి తీరు ఓ సినిమాలో బ్రహ్మానందం దీపావళి పండగరోజు వినాయక చవితి జరుపుకున్నట్లు వుందంటూ పోతిన మహేష్ సెటైర్లు వేసారు. కేవలం వెల్లంపల్లి పుట్టినరోజే కాదు ఆయన చదువు కూడా పేక్ అని మహేష్ ఆరోపించారు. నిజంగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్లు హిందూ హైస్కూల్లో పదో తరగతి చదివివుంటే అందుకు సంబంధించి ఏ సర్టిఫికెట్ వున్నా బయటపెట్టాలని మహేష్ కోరాడు.