Apr 4, 2022, 3:15 PM IST
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై విధించిన U1 జోన్ ను ఎత్తివేయాలని బాధిత రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూ-1 జోన్ బాధిత రైతులకు ఉద్యమానికి మద్దతిచ్చేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సిద్దమయ్యాయని ఆ పార్టీ మంగళగిరి ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే U1 జోన్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కు వివరించగా త్వరలోనే రైతులను పరామర్శించనున్నట్లు పవన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జనసేన పార్టీతో పాటు బిజెపి నాయకులు కూడా U1 జోన్ బాధిత రైతులకు మద్దతుగా మద్దతు తెలిపారు