Feb 1, 2021, 10:17 AM IST
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఇష్ఠ హోటల్ సమీపంలో రాత్రి గుర్తు తెలియని వాహనం ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న వారిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గురయిన వారిది చిల్లకల్లు గ్రామంగా తెలుస్తోంది.
కోదాడ నుండి చిల్లకల్లు వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదిలావుంటే ఇదే 65వ నంబర్ జాతీయ రహదారిపై గౌరవరం వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగివున్న ఆటోలను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. దీంతో పల్టీలు కొట్టిన రెండు ఆటోలు సర్వీస్ రోడ్ పై పడ్డాయి. దీంతో ఆటో డ్రైవర్లతో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. బాధితులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.