ముళ్లపొదల్లో దేవుళ్ల ప్రసాదాలు, వందలాది ఆధార్ కార్డులు ... జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది నిర్వాకమీది..

Jun 23, 2022, 2:30 PM IST

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. ప్రజలకు చేర్చాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నారు పోస్టల్ సిబ్బంది. ఇలా ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లెటర్స్, వివిధ ప్రభుత్వ శాఖల చేరాల్సిన లేఖలను తొర్రగుంటపాలెం ఆర్టీవో ఆఫీస్ వెనక ముళ్ళకంపలో పడేశారు.  వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు డబ్బుతో కొనుక్కునే స్టడీ మెటీరియల్, సుమారు రెండు వందల ఒరిజినల్  ఆధార్ కార్డులు, ఇలా ఎన్నో రకాల రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. రిజిస్టర్ పోస్ట్ లకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ ప్రజల అడ్రస్ కు చేర్చకుండా ముళ్ళకంపలో పడేసిన సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని... విధుల్లో అలసత్వం వహించి చెత్తకుప్పలో పడేసిన ఉత్తరాలను ప్రజలకు చేర్చాలని జగ్గయ్యపేట వాసులు కోరుతున్నారు.