Nov 9, 2022, 10:17 AM IST
తాడేపల్లి : రోడ్డు విస్తరణ కోసమంటూ తమ ఇళ్లను ప్రభుత్వమే కూల్చేయడంతో దిక్కుతోచని స్థితిలో వున్న తమకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇప్పటం గ్రామస్తులు అభిమానాన్ని చాటుకున్నారు. తమకోసం స్వయంగా ఇప్పటం వచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టడమే కాదు కూల్చివేతలతో గూడు కోల్పోయిన కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసిన పవన్ భారీ ప్లెక్సీని ఇప్పటంలో ఏర్పాటుచేసారు. ఈ పవన్ ప్లెక్సీకి పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు ఇప్పటం గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు ఇప్పటం గ్రామస్తులు పాల్గొన్నారు.