సిరిసిల్లలో 2K రన్, విశాఖలో ప్లాగ్ మార్చ్... తెలుగురాష్ట్రాలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Aug 11, 2022, 12:29 PM IST

యావత్ దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అజాదీ అమృత్ మహెత్సవాలు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ భారత స్వతంత్ర వజ్రోత్సవాలు... పేరు ఏదయితేనేం అటు ఏపీ, ఇటు తెలంగాణలో విద్యార్థులు, యువతలో దేశ భక్తిని పొంపొందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలా ఇవాళ (గురువారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులతో 2K రన్ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్  చౌక్ వద్ద భారీ తిరంగ పతాకంతో విద్యార్థులు చేపట్టిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే జెండాఊపి ప్రారంభించారు.     మరోవైపు ఏపీలోని విశాఖపట్నంలో  హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాలతో ఘనంగా ప్లాగ్ మార్చ్ జరిగింది. భారీ జాతీయ పతాకంతో  విద్యార్థులు, యువత ర్యాలీ చేపట్టారు. విశాఖ సాగర తీరంలోని వైఎంసిఏ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్లాగ్ మార్చ్ సాగింది.