Apr 4, 2023, 5:32 PM IST
గిరిజన జాబితాలో ఇతర కులాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్-[టి ఎస్ ఎఫ్] ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత వెనుకబడ్డ గిరిజన జాబితాలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన బోయ/వాల్మీకి, బెంతో, ఒరియా కులాలను ఎస్టి జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మే నెలలో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద టి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్-[టి ఎస్ ఎఫ్] జాతీయ అధ్యక్షులు అక్కులప్ప నాయక్. రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్ప, కార్యదర్శి విష్ణు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్ర నాయక్, సలహాదారులు విజయ్ నాయక్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ము సిద్ధించి 75 ఏళ్లు గడిచినా విద్యా, ఉద్యోగ, ఉపాధి వైద్యం,ఆరోగ్య,ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబడ్డ గిరిజన జాబితాలో ఇతర కులాలను చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపడం అనేది గిరిజనులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు.