Sep 15, 2022, 2:13 PM IST
గుంటూరు జిల్లా : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పై సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డిజిపిని కలిసి కోరారు. ముఖ్యమంత్రి సతీమణి భారతి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం చేయడానికి సంబంధించిన ఆధారాలు ను డిజిపి కి సమర్పించాం. మహిళలను అడ్డుపెట్టుకుని, వారినే లక్ష్యంగా పెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదు అని ఆమె అన్నారు.