Aug 13, 2021, 1:55 PM IST
కృష్టా జిల్లా విజయవాడలో ప్రభుత్వ సిబ్బందిపైనే హత్యాయత్నం జరిగింది. నగరంలోని కృష్ణలంకలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడి ఓ భవన యజమాని దాడికి యత్నించాడు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన భవన యజమాని బిల్డింగ్ ఇన్స్ పెక్టర్, మహిళా వార్డు సెక్రటరీలపై ఐరన్ రాడ్డుతో దాడికి యత్నించాడు. అధికారులపై దాడి వెనుక స్థానిక కార్పొరేటర్ హస్తం వుందన్న ప్రచారం జరుగుతోంది.