వైసిపి అలా గెలిస్తే టిడిపిని మూసుకుంటాం..: పల్లా శ్రీనివాసరావు

Jun 12, 2022, 4:00 PM IST

విశాఖపట్నం: వైసిపి పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిస్తే టిడిపి పార్టీని మూసుకుంటామని విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 'క్విట్ జగన్ ‌‌- సేవ్ ఏపి' నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని పల్లా అన్నారు. జగన్ పాలనలో 37 మంది టిడిపి నాయకులు హత్యకు గురయ్యారని అన్నారు. ఇక పాలనా నిర్లక్ష్యం, హత్యా రాజకీయాలాలకు లక్షా 24 వేల మంది చనిపోయారని పల్లా పేర్కొన్నారు. అధికారంలోకి రావడం కోసం చివరకు బాబాయ్ వివేకానందను కూడా హత్య చేయించారని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.