రోడ్డుపై గాయాలతో పడివున్న దంపతులను కాపాడి... మానవత్వం చాటుకున్న హోంమంత్రి వనిత

Apr 28, 2022, 1:21 PM IST

మంగళగిరి: తన బిజీ షెడ్యూల్ లో కూడా సాటి మహిళ ప్రాణాల కాపాడేందుకు సమయం వెచ్చించి మంచిమనసును చాటుకున్నారు హోంమంత్రి తానేటి వనిత. బుధవారం రాత్రి మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీ కొట్టగా గాయాలతో రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో అటువైపుగా వచ్చిన హోమంత్రి గాయాలతో పడివున్న దంపతులను గమనించారు. దీంతో వెంటనే తన కాన్వాయ్ ని ఆపి వారికి సహాయం చేసారు. అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చే వరకు అక్కడే వుండిమహిళకు ధైర్యం చెప్పారు మంత్రి వనిత. అంతేకాదు గాయపడిన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించి మానవత్వం చాటుకున్నారు హోం మినిస్టర్ వనిత.