Oct 18, 2022, 12:38 PM IST
కొవ్వూరు : గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం కలవపల్లి గ్రామంలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీచేసారు. ఈ క్రమంలోనే రేకుల షెడ్డులో ధీనావస్థలో జీవిస్తున్న ఓ వృద్దురాలిని చూసి మంత్రి చలించిపోయారు. ఐదుగురు కొడుకులున్నా దిక్కులేనిదానిలా ఒంటరిగా జీవిస్తున్న ఆ తల్లి ఇళ్లు కట్టివ్వాలని మంత్రిని కోరారు. దీంతో ఆమెను వృద్దాశ్రమానికి తరలించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇక ఇంటింటికి తిరిగుతూ ఈ మూడేళ్లలో వైసిపి ప్రభుత్వ, సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్దిని మంత్రి వనిత వివరించారు. ముఖ్యంగా గ్రామంలోని వృద్దుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్దాప్య పెన్షన్ అందుతుందా... బిడ్డలు సరిగ్గా చూసుకుంటున్నారా... ప్రభుత్వం నుండి ఇంకేమయినా సాయం కావాలా అంటూ మంత్రి వనిత ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.