Sep 12, 2022, 3:56 PM IST
గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి... వారికి కౌంటర్ గా వైసిపి ఆందోళనలతో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిన్న టిడిపి నేతలు ఆందోళనకు దిగగా ఇవాళ టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. గుడివాడ వైసిపి కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైసిపి శ్రేణులు కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసారు. అనంతరం భారీ ర్యాలీగా పట్టణంలోని నెహ్రూ సెంటర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసిపి నాయకులపై మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.