Jun 6, 2022, 11:23 AM IST
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (సోమవారం) ఉదయం నుండి వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపునీటితో రోడ్లన్ని జలమయం అయ్యారు. ఉదయం 6గంటల నుండే భారీ వర్షం కురుస్తుండటంతో బయటకువెళ్లలేక ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.