మాజీ మంత్రి ఇలాకాలో ఇదీ పరిస్థితి.... చెరువులా మారిన గుడివాడ బస్టాండ్

Sep 11, 2022, 11:43 AM IST


గుడివాడ : గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వర్షపునీరు నిలవడంతో రోడ్లు గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందుకులు గురవుతున్నారు. ఇలా గుడివాడలో కూడా భారీ వర్షం దాటికి స్థానిక బస్టాండ్ ప్రాంగణం చెరువులా మారింది. వర్షపునీరు బయటకువెళ్లే మార్గం లేకపోవడంతో వర్షపునీరంతా ప్రయాణప్రాంగణంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇదే నీటిలో ప్రమాదకరంగా నడవాల్సి వస్తోంది. 

వర్షాకాలం వచ్చిందంటే చాలు గుడివాడ బస్టాండ్ చెరువులా మారిపోవడం ఆనవాయితీగా మారిందని స్థానికులు తెలిపారు.  ఇందుకు శాశ్వత పరిష్కారం వెతకకుండా అధికారులు మోటార్ల ద్వారా ఈ నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.