మాజీ ఉపరాష్ట్రపతిగా తొలిసారి గుంటూరుకు వెంకయ్యనాయుడు... ఘనస్వాగతం, ఆత్మీయ సన్మానం

Sep 9, 2022, 3:07 PM IST

గుంటూరు : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గుంటూరులో ఘనస్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోయిన తర్వాత మొదటిసారి గుంటూరుకు వచ్చిన వెంకయ్యకు ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. 

ఈ సంందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చట్టసభల స్థాయిని తగ్గించడం దేశానికి మంచిది కాదన్నారు. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థల పరిధిని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని... అందుకు లోబడే ప్రతిఒక్కరు వ్యవహరించాలని సూచించారు. ఇక మాతృ బాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లీష్, హిందీ వంటి ఇతర బాషలు నేర్చుకోవాలని సూచించారు. ఇలా మాత‌ృబాషలో చదువుకునే చాలామంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.