లాక్ డౌన్ : మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచివి కావు.. గవర్నర్

Apr 4, 2020, 5:23 PM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ లాక్ డౌన్ ను ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. చివరి రోజు వరకు ఎటువంటి వెసులు బాటు లేకుండా దీనిని పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆ మేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని హరిచందన్ పిలుపు నిచ్చారు. అయా సీజన్ల మేరకు జరగవలసిన వ్యవసాయపనులను వాయిదా వేయలేమని, వ్యవసాయ పనులలో సైతం సామాజిక దూరం అవసరమని, వ్యవసాయ 
ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వ తీసుకుంటుందని గవర్నర్ అన్నారు.  ఈ మేరకు శనివారం రాజ్ భవన్ ప్రకటన వెలువరించింది.