Jun 9, 2021, 5:57 PM IST
గుంటూరు: కుటుంబ కలహాలతో మనోవేధనకు గురయిన ఓ వ్యక్తం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. ఇలా నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన తిరుమళ్ళ మహంతి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నదిలో నుండి మృతదేహాన్ని బయటకుతీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.