Apr 26, 2022, 9:57 AM IST
గుంటూరు: పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంగిరెడ్డిపాలెంకు చెందిన రాచూరి నాగరాజు-సుశీల దంపతులు కష్టపడి సంపాదించిన మూడు లక్షల నగదును ఇంట్లో దాచారు. అలాగే నాలుగు లక్షల విలువైన బంగారం కూడా ఇంట్లోనే వుందట. ఒక్కసారిగా గ్యాస్ పేలుడు జరిగడంతో మంటల్లో నగదు, బంగారం కాలిపోయింది. అలాగే ఇంట్లోని వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయి. మొత్తంగా ఈ గ్యాస్ పేలుడు కారణంగా రూ.8లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధిత కుటుంబం తెలిపింది.