గడపగడపకు మన ప్రభుత్వం ఉద్దేశ్యమిదే...: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Nov 9, 2022, 12:24 PM IST

విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ నేతృత్వంలో ఏపీలో సుపరిపాలన సాగుతోందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఇప్పటికే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలన్నిటింని సీఎం దాదాపు నెరవేర్చారన్నారు. అయినప్పటికి ఇంకా ఏమయినా మిగిలివుంటే... ఎవరికైనా అభివృద్ది, సంక్షేమ పలాలు అందకుంటే గుర్తించి అండగా నిలిచేందుకే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వంశీ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఎమ్మెల్యే వంశీ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కులమతాలు, రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా చూసేందుకు గడపగడపకు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో అన్ని వర్గాలు, కులాల వారికి అర్హత ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే వంశీ పేర్కొన్నారు.