జాతీయ జెండా ఎగరేసి... గన్నవరం విమానాశ్రయ బాధితుల వినూత్న నిరసన

Aug 15, 2023, 5:36 PM IST

గన్నవరం : స్వాతంత్య్ర దినోత్సవం రోజున గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన బాధితులు ఆందోళనకు దిగారు. ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అఫ్ అల్లాపురం ఆధ్వర్యంలో తమ సొంత స్థలాల్లో జాతీయ జెండా ఎగరేసారు బాధితులు. విమానాశ్రయ అభివృద్దికోసం తమ భూములు తీసుకుని ఏడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ప్లాట్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విమానాశ్రయ అభివృద్ధి కొరకు భూములు ఇచ్చిన తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.