Sep 9, 2022, 11:00 AM IST
నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వాసవి మార్కెట్ వద్ద గత 40ఏళ్లుగా బొజ్జగణపయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఘనంగా వేడుక జరుపుతున్నారు. అయితే ఈసారి 40ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవ కమిటీ సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఆర్టిస్టులతో కార్యక్రమాలను ఏర్పాటుచేసింది. మహిళల కూచీపుడి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు తమ స్టైల్ స్కిట్ లతో కామెడీ పండించారు.