Jun 8, 2022, 10:10 AM IST
నర్పీపట్నం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న అధికార పార్టీ నాయకులకు నిరసన సెగలు తగులుతున్నాయి. తాజాగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని పెదగొలుగొండపేటలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గ్రామ మహిళలు కొందరు అమ్మఒడి డబ్బులు రాలేవంటూ ఎమ్మెల్యేను నిలదీసారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వైసిపి నాయకులు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తెగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసకుంది.