మూడు రోజులుగా గల్లంతైన మత్స్యకారులు.. కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన పేర్ని నాని..

Jul 6, 2022, 1:04 PM IST

కృష్ణా జిల్లాలో నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కుటుంబాలకు పేర్నినాని ఓదార్చారు. వారు తప్పకుండా తిరిగి వస్తారంటూ ధైర్యం చెప్పారు. కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లాలో గత 3 రోజులుగా మత్య్సకారుల ఆచూకీ దొరకడం లేదు. శనివారం వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బోటు పాడైందని, అంతర్వేది సమీపంలో ఉన్నామని  కుటుంబ సభ్యులకు  మత్స్యకారులు సమాచారం తెలిపారు. అయితే, అంతర్వేది వద్ద గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటలో మత్స్యకారుల కుటుంబాలను మాజీ మంత్రి పేర్ని నానిపరామర్శించారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నాం ధైర్యంగా ఉండాలని పేర్ని నాని ధైర్యం చెప్పారు.మత్స్యకారులతో ఫోన్ కాంటాక్ట్ లేకపోవడంతో స్థానిక మత్యకారులు బోట్ లో వేతకటానికి అంతర్వేది వెళ్లారని, అయినా దొరకకపోవడంతో తనకు నాకు మెస్సేజ్ ఇచ్చారని నాని తెలిపారు. దీంతో సోమవారం సాయంత్రం నుండి హెలికాప్టర్ సెర్చ్ చేస్తుందని, అంతర్వేది, చెన్నై, కాకినాడ తదితర ప్రాంతాల వైపు గాలింపు కొనసాగుతుందని క్షేమంగా బయటకు వస్తారనే నమ్మకం ఉందన్నారు.