Nov 5, 2019, 12:17 PM IST
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుటుంబ సభ్యులతో సహా పార్టీలో చేరుతున్న సన్యాసిపాత్రుడుని సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా పాలన బాగుంది కాబట్టే వేరేపార్టీ నేతలు మా పార్టీలో చేరుతున్నారన్నారు.