పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం ఉద్దేశ్యమిదే..: ఎఫ్ సి ఐ జనగర్ మేనేజర్ కిరణ్

Nov 14, 2022, 4:47 PM IST

తాడేపల్లి :  భారత ప్రభుత్వం పోషకాహార లోప నివారణకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం ఎంతో దోహదపడుతోందని ఎఫ్ సి ఐ జనల్ మేనేజర్ రగల్ కిరణ్ తెలిపారు. ప్రజా పంపిణి మంత్రత్వశాఖ పిలుపు మేరకు ఇవాళ తాడేపల్లి కృష్ణ కెనాల్ జంక్షన్ వద్ద గల ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎఫ్ సి ఐ అధికారులు మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ఆరు దశలుగా పూర్తయిందని... ఏడవ దశ అక్టోబర్ నుంచి డిసెంబర్ 2022 వరకు అమలుకానుందని తెలిపారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి నెలకు ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తోందని... ఇందుకోసం ఇప్పటివరకు సుమారు 3.91 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.