ఏం పిల్లడో ఎల్డమొస్తవా అంటూ.. విప్లవ పాటలతో వంగపండు అంత్యక్రియలు...

4, Aug 2020, 5:28 PM

ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసిన‌.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం కుప్పకూలింది. ప్రజాకవి, ప్ర‌ముఖ వాగ్గేయ‌కారుడు వంగపండు ప్రసాదరావు విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వతీపురం వైకెఎం నగర్‌లో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు, జన నాట్యమండలికి అద్యక్షుడిగా పనిచేసారు.  400కి పైగా జానపద గీతాలు రాసిన వంగపండు.. 30కిపైగా సినిమాలకి పాటలు రాశారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ ఆయన పాడిన పాట ఎంద‌రినో ఆలోచింప‌జేసింది. అదే పాటను ఆలపిస్తూ ఆయన అంత్యక్రియలు నిర్వహించడం అందర్నీ కంటతడి పెట్టించింది