Aug 16, 2022, 12:07 PM IST
విజయవాడ : కృష్ణా నది వరద ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం మెల్లగా తగ్గుతోంది. గతకొంతకాలంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజికి భారీగా వరద నీరు చేరింది. అయితే రెండుమూడు రోజులుగా వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం కూడా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి 2,85,055 క్యూసెక్కుల ప్రవాహం వుండగా 60 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 2,70,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మరో 14,955 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదిలిపెడుతున్నారు.