Jul 30, 2022, 11:46 AM IST
ఈ అయిదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా 8 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్ళు, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి : పూడిమడక సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ కెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లి టౌన్ లో ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో గల్లంతైన పవన్ మృతదేహం లభ్యం మయ్యింది. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన తేజను ఆసుపత్రికి తరలించారు.
గల్లంతైన వారి వివరాలు..
జగదీష్.. గోపాలపట్నం
జశ్వంత్.. నర్సీపట్నం
సతీష్..గుంటూరు
గణేష్.. చూచుకొండ
చందు.. ఎలమంచలి