విశాఖ పోర్ట్ వద్ద ఉద్రిక్తత... ఉద్యోగాల కోసం మత్సకారుల ఆందోళన

Mar 30, 2022, 2:18 PM IST

 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గేట్ వద్ద స్థానిక మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఇరవై ఏళ్ళ క్రితం (2002) విశాఖ కంటైనర్ టెర్మినల్ పోర్టు లిమిటెడ్ నిర్మాణ సమయంలో 424 మత్స్య కార కుటుంబాలు భూములు కోల్పోయాయని... వీరికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చినట్లు ఆందోళనకారులు తెలిపారు. అయితే ఇరవైఏళ్లు గడిచినా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరియు VCTPL వారు స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలంటూ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం కొత్తజాలారిపేట, పెయిందొకపేట, విశాఖపట్నం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.