ప్రమాదం... గ్యాస్ సిలిండర్ పేలి రెండిళ్లు దగ్దం

Feb 4, 2021, 3:02 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటురు గ్రామంలో ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో గ్యాస్ పేలడంతో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే సకాలంలో  అగ్నిమాపక శాఖ బృందం ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.