కృష్ణా జిల్లాలో ఘోరం... మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన పత్తి

Dec 1, 2021, 2:48 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రేమల్లి మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన కాటన్ బెల్ గోదామ్ యూనిట్ -2లో మంటలు అంటుకున్నాయి. అంతకంతకు ఈ మంటలు పెరుగుతూ యనిట్ మొత్తాన్ని ఆవరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్లు ద్వారా మంటల అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా భారీగా ఆస్తినష్టం మాత్రం జరిగింది.  అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.