పల్నాడులో అమానుషం... కన్న తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

Jul 31, 2022, 2:30 PM IST

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. కన్నప్రేమను మరిచి ఓ తండ్రి కన్నకొడుకును అతి దారుణంగా కొట్టిచంపాడు. వివరాల్లోకి వెళితే... కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపి (20)కి డబ్బుల విషయంలో తండ్రీతో వివాదం చెలరేగింది. అయితే కొడుకు తనతో వాగ్వాదానికి దిగడాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి ఆవేశంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన తండ్రి ఇనుప రాడ్ తో కొడుకును బలంగా కొట్టాడు.  దీంతో గోపి రక్తపుమడుగులో పడిపోయి అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి పొలంలొ పాతిపెట్టాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నిందితున్ని అరెస్ట్  చేసారు.