Jun 10, 2022, 1:30 PM IST
తాడేపల్లి: తమకు నష్టపరిహారం చెల్లించకుండానే కరకట్ట రోడ్డువిస్తరణ పనులు చేపడుతుండటంతో ఆగ్రహించిన బాధిత రైతులు ఆందోళనకు దిగారు. సీతానగరం నుండి రాయపూడికి 15 కిలోమీటర్లు మేర జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా ఇలాగే కరకట్ట అభివృధి పనుల పేరుతో మా పొలాల్లోకి ప్రవేశిస్తే ఆత్మహత్యే శరణ్యమని ఉండవల్లికి చెందిన 30 మంది బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని బాధిత రైతులు చెబుతున్నారు.