Sep 13, 2022, 1:46 PM IST
గుంటూరు జిల్లా : 22 గ్రామాలతో కూడిన అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును దొండపాడు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలతో కూడిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయాలని దొండపాడు గ్రామస్తులు తెలిపారు. దీంతో రైతులు దొండపాడులో అధికారులను నిలదీశారు. తాము సీఆర్డీఏకి భూములు ఇచ్చాం, నాన్ పూలింగ్ గ్రామాలైన హరిశ్చంద్రపురం, వడ్డమాను,పెదపరిమి గ్రామాలను అమరావతి మున్సిపాలిటీ లో ఎలా కలుపుతారు..? నాన్ పూలింగ్ గ్రామాల వారి భూములు సీఆర్డీఏకి ఇవ్వలేదు. ఒకసారి క్యాపిటల్ సిటీ అన్నారు. మరో మారు అమరావతి మెట్రోపాలిటన్ సిటీ అన్నారు. ఇప్పుడొచ్చి అమరావతి మున్సిపాలిటీ అంటూ వచ్చారు. రేపు గౌర్నమెంట్ మారితే...మళ్ళీ పంచాయితీ అంటారేమో..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.