ధాన్యానికి మద్దతుధర కోసం... గుడివాడలో అన్నదాతల ఆందోళన

Nov 30, 2022, 1:55 PM IST

గుడివాడ : ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు-చౌటపల్లి అడ్డరోడ్డులో బైఠాయించిన రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం, రైతు భరోసా కేంద్రంతో సంబంధం లేకుండా బస్తాకు రూ.1800 చెల్లించి కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.